Horrible remarks of manmohan singh

Join us for a talk on Current affairs on a wide range of topics. Hot topics for talk includes vulgarity in Telugu films, status of belt shops and other social problems.
whatever123
Telugu Simham
Posts: 1486
Joined: November 30th, 2006, 7:47 pm

Horrible remarks of manmohan singh

Postby whatever123 » November 20th, 2016, 10:14 pm

It shows how light delhi took andhra people. And how they are willing to punish us because of competency.

http://www.andhrajyothy.com/artical?SID=336311

ఏపీకేం పర్వాలేదు.. బాబు ఉన్నారుగా: మన్మోహన్‌
20-11-2016 03:53:43
న్యూఢిల్లీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఎలా ఉంది?...వ్యవస్థ గాడిలో పడిందా? ఆర్థిక రంగం పట్టాలెక్కిందా..? అయినా మీకేం ప్రాబ్లమ్‌ లేదులే.. చంద్రబాబు ఉన్నారుగా..! కష్టపడి ఏదో విధంగా అభివృద్ధి చేస్తారులే’ అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి వేడుకలు శనివారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో జరిగాయి. సోనియాగాంధీ, మన్మోహన్‌లతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ సీనియర్‌ నేతలు, పార్లమెంటు సభ్యులు, మాజీ ఎంపీలు హాజరయ్యారు. ఇందిరాగాంధీ చిత్రపటం ముందు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడొకరు మన్మోహన్‌తో కాసేపు ముచ్చటించారు. ఏపీ అభివృద్ధిపై మాజీ ప్రధాని ఆరా తీశారు. విభజన జరిగాక ఎలా ముందుకెళ్తోందని అడిగారు. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ర్టాలు తప్పకుండా పురోగమిస్తాయనడంలో సందేహం లేదని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రం కాబట్టి దిగులు లేదని, ఆంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా దిగులు పడాల్సింది లేదన్నారు. సహజంగా ఎవరి వద్దా పెద్దగా మాట్లాడని మన్మోహన్‌.. తన చిరకాల మిత్రులు కలిసినప్పుడు మాత్రం మనసులోని మాటలను బయటపెడుతూ ఉంటారని సదరు మాజీ ఎంపీ తెలిపారు.

Return to “General Discussions”

Who is online

Users browsing this forum: No registered users and 1 guest